భవన నిర్మాణాల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2020-02-20T09:17:59+05:30 IST

కాకినా డ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని టౌన్‌ ప్లానింగ్‌లో విభాగంలో రెండు రోజులుగా

భవన నిర్మాణాల్లో అక్రమాలు

ప్లాన్‌ అప్రూవల్‌కు వాస్తవ నిర్మాణాలకు పొంతన లేని వైనం

రికార్డుల్లోనూ అవకతవకలు

కాకినాడలో పలు భవన నిర్మాణాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు


కాకినాడ కార్పొరేషన్‌, ఫిబ్రవరి 19: కాకినా డ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని టౌన్‌ ప్లానింగ్‌లో విభాగంలో రెండు రోజులుగా జరుగుతున్న ఏసీబీ దాడుల్లో అధికారుల అక్రమడొంక కదులుతోంది. బుధవారం ఏసీబీ ఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు పీవీవీ సూర్య మోహన్‌రావు, వి.పుల్లారావు, పీవీజీ తిలక్‌లు నాలు గు బృందాలుగా విడిపోయి జగన్నాథపురం, కుమ్మ రివీధి, రామారావుపేట, డెయిరీఫారమ్‌ సెంటర్‌ల్లో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న కొలతల ప్రకారం భవనాల కొలతల ను  పరిశీలించారు. వీరి వెంట బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఐదు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికుమార్‌ మా ట్లాడుతూ మంగళవారం రికార్డుల పరిశీలనలో భాగంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి టౌన్‌ ప్లానిం గ్‌ అధికారులు గండికొండుతున్నట్టు తేలిందన్నారు.


బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీ లించగా కట్టవల్సిన దానికి, కట్టించు కున్న డబ్బులకు తేడాలు గుర్తించామ న్నారు. ఆడిట్‌లో కూడా ఈ విషయా లు వెలుగుచూశాయని ఎస్పీ తెలి పారు. అక్రమ నిర్మాణాలకు సంబం ధించి ఎటువంటి రికార్డులు పెట్టకుండా ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణా లపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. అప్లై చేసుకున్న ప్లాన్‌లను అధికారులు సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతు న్నట్టు కూడా గుర్తించామన్నారు. గ్రీవెన్స్‌, స్పందనకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల సమస్యలను కూడా సమయానికి పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని అన్నారు. ఒక వైపు ప్రభుత్వం స్పందన సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశిం చిన ప్పటికీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు.


నాలుగేళ్ల నుంచి  ప్రకట నలకు సంబంధించిన ట్యాక్స్‌లు కూడా వసూలు చేయకుండా జాప్యం చేస్తున్నార న్నారు. కాగా సంజయ్‌ నగర్‌లో 186 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 12.20 మీటర్ల ఎత్తుతో జిప్లస్‌-2 (స్టిల్ట్‌+గ్రౌండ్‌+2ఫోర్లు) నిర్మాణానికి అనుమతులు తీసుకుని 216 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 18 మీటర్ల ఎత్తుతో జిప్లస్‌-4 (స్టిల్ట్‌+గ్రౌండ్‌+4ఫోర్లు) నిర్మాణం చేపట్టిన భవనా న్ని అధికారులు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో రోజువారి కార్యకలాపాలు, ప్లాన్‌ అఫ్రూవల్‌, ఇక్కడ గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక  సమర్పిస్తామని ఎస్పీ రవికుమార్‌ చెప్పారు.

Updated Date - 2020-02-20T09:17:59+05:30 IST