Abn logo
Oct 21 2021 @ 00:38AM

ఉక్కు సత్యాగ్రహి అమృతరావు శతజయంతి పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 20: ఉక్కు సత్యాగ్రహి టి.అమృతరావు శతజయంతి ఉత్సవాల పోస్టర్‌ను బుధవారం స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ ఆవిష్కరించారు. అమృతరావు మనుమడు టి.మోహన్‌గాంధీ, శత జయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్‌ ఏవీ రమణారావు, ప్రతినిధులు సీఎండీని బుధవారం కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా కృషి చేయాలని, ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. గురువారం అమృతరావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ జెర్రిపోతుల మోహన్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.