రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోండి!

ABN , First Publish Date - 2020-07-14T09:01:44+05:30 IST

కరోనా వైరస్‌ ఉధృతి తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పేసర్లు రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోవాలని భారత మాజీ పేసర్...

రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోండి!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఉధృతి తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పేసర్లు రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోవాలని భారత మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య ముగిసిన తొలి టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను పరిశీలిస్తే తన వ్యాఖ్యలు అర్థమవుతాయని ఇర్ఫాన్‌ అన్నాడు. ‘ఉమ్మి రివర్స్‌ స్వింగ్‌కు దోహదపడుతుంది. ప్రస్తుతం ఉమ్మిపై నిషేధం ఉండడంతో ఏదైన ఇతర వస్తువుతో బంతిని రివర్స్‌ స్వింగ్‌ అయ్యేలా చేసేందుకు అనుమతి ఇవ్వాలి’ అని పఠాన్‌ కోరాడు.

Updated Date - 2020-07-14T09:01:44+05:30 IST