కొత్త పాలసీలకు పేర్లు సూచించండి

ABN , First Publish Date - 2020-06-29T06:10:38+05:30 IST

నిర్దేశిత గ్రూప్‌లను ఉద్దేశించి వారి అవసరాలు, ఆకాంక్షలను తీర్చేందుకు అనుగుణంగా విడుదల చేయనున్న పాలసీలకు పేర్లు సూచించాలని ఐఆర్‌డీఏఐ ప్రజలను కోరింది. చిన్న చిన్న ఇళ్లు, చిన్న తరహా వ్యాపారాలను అగ్ని ప్రమాదాలు...

కొత్త పాలసీలకు పేర్లు సూచించండి

న్యూఢిల్లీ: నిర్దేశిత గ్రూప్‌లను ఉద్దేశించి వారి అవసరాలు, ఆకాంక్షలను తీర్చేందుకు అనుగుణంగా విడుదల చేయనున్న పాలసీలకు పేర్లు సూచించాలని ఐఆర్‌డీఏఐ ప్రజలను కోరింది. చిన్న చిన్న ఇళ్లు, చిన్న తరహా వ్యాపారాలను అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి ఇతర ప్రత్యేక ప్రమాదాల నుంచి కాపాడేందుకు స్టాండర్డ్‌ పాలసీలు విడుదల చేయనున్నట్టు సంస్థ ప్రకటించిన విషయం విదితమే. జూలై 10 లోపు సరైన పేరు సూచించిన వారికి రూ.10 వేల అవార్డుతో పాటు ప్రశంసా పత్రం కూడా అందించనున్నట్టు తెలిపింది. 


Updated Date - 2020-06-29T06:10:38+05:30 IST