IRCONలో 16 ఖాళీలు

ABN , First Publish Date - 2022-05-06T20:26:22+05:30 IST

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌...వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

IRCONలో 16 ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌...వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ఫైనాన్స్‌ అసిస్టెంట్‌-08; హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌-05; ఐటీ ఇన్‌చార్జ్‌-03

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, పీజీ డిగ్రీ/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2022 ఏప్రిల్‌ 01 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 09

దరఖాస్తు హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 16   

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

Read more