చమురు అమ్ముకోనీయండి.. ట్రంప్‌కు ఇరాన్ వినతి

ABN , First Publish Date - 2020-04-09T03:12:06+05:30 IST

కరోనా సంక్షోభం పెరుగుతున్న సమయంలో చమురును విక్రయించి నిధులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌కు అడ్డుపడొద్దని ఇరాన్ ఆర్థిక మంత్రి జావేద్ జారిఫ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కోరారు.

చమురు అమ్ముకోనీయండి.. ట్రంప్‌కు ఇరాన్ వినతి

అంకారా: కరోనా సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు చమురును విక్రయించి నిధులను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఇరాన్‌కు అడ్డుపడొద్దని ఆ దేశ ఆర్థిక మంత్రి జావేద్ జారిఫ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ‘చమురు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌కు అడ్డుపడొద్దు. ట్రంప్ నుంచి మేము కోరుకుంటోంది ఇదే’ అని జావేద్ వ్యాఖ్యానించారు. తమ కోసం ట్రంప్ దానం చేయాల్సిన అవసరమేమీ లేదని అన్నారు.  కరోనా కారణంగా కష్టపడుతున్న ప్రజల్నిఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న తమ ప్రభుత్వానికి ఆర్థిక ఆంక్షల రూపంలో అడ్డుతగలద్దని ఆయన కోరారు.

Updated Date - 2020-04-09T03:12:06+05:30 IST