ఆ వెయ్యి కోట్లు ఇచ్చేయండి.. America ను కోరిన ఇరాన్

ABN , First Publish Date - 2021-10-04T07:36:01+05:30 IST

తమకు రావలసిన 1000 కోట్ల నిధులను అమెరికా విడుదల చేయాలని ఇరాన్ కోరింది. అణుఒప్పందాల గురించి మాట్లాడే ముందు అమెరికా ఓ పని చేయాలని, ఆ తర్వాతే మిగతా విషయాలపై చర్చలకు రావాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్దుల్లాహియన్ శనివారం ఓ ప్రకటన చేశారు. ముందుగా తమకు అమెరికా నుంచి రావలసిన 10 బిలియన్ డాలర్లు(రూ. వెయ్యి కోట్లు) ఇవ్వాలని, ఆ తర్వాత అణు ఒప్పందాల గురించి మాట్లాడుకుందామని ఆయన పేర్కొన్నారు.

ఆ వెయ్యి కోట్లు ఇచ్చేయండి.. America ను కోరిన ఇరాన్

తెహ్రాన్: తమకు రావలసిన 1000 కోట్ల నిధులను అమెరికా విడుదల చేయాలని ఇరాన్ కోరింది. అణుఒప్పందాల గురించి మాట్లాడే ముందు అమెరికా ఓ పని చేయాలని, ఆ తర్వాతే మిగతా విషయాలపై చర్చలకు రావాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్దుల్లాహియన్ శనివారం ఓ ప్రకటన చేశారు. ముందుగా తమకు అమెరికా నుంచి రావలసిన 10 బిలియన్ డాలర్లు(రూ. వెయ్యి కోట్లు) ఇవ్వాలని, ఆ తర్వాత అణు ఒప్పందాల గురించి మాట్లాడుకుందామని ఆయన పేర్కొన్నారు. ‘అణు ఒప్పందంపై చర్చలకంటే ముందుగా అమెరికా ఓ పని చేయాలి. మాపై విధించిన ఆంక్షలను తొలిగించాలి. ఆ ఆంక్షల వల్ల మాకు రావలసిన 10 బిలియన్ డాలర్ల నిధులను అందజేయాలి. అప్పుడే అణు చర్చల గురించి ఆలోచిస్తాం. ఈ విషయంలో ముందుగా అమెరికానే అడుగు వేయాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.


కాగా.. 2018లో అనుమతికి మించి ఇరాన్ యురేనియం నిల్వలను కూడబెట్టిందనే ఆరోపణతో ఆ దేశంపై ఆంక్షలు విధించింది. అయితే బైడెన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరాన్ సర్కార్ అనేక సార్లు ఆంక్షల తొలగింపు గురించి అమెరితో మాట్లాడింది. అయితే అణు ఒప్పందానికి సంబంధించి ముందుగా ఇరాన్ వైపు నుంచే అడుగులు పడాలని, అప్పుడే తాము ఆంక్షల తొలగింపు గురించి ఆలోచిస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.

Updated Date - 2021-10-04T07:36:01+05:30 IST