ఏయూతో ఐపీటీఎస్‌ఈ అకాడమీ ఎంవోయూ

ABN , First Publish Date - 2021-06-15T05:32:10+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో న్యూఢిల్లీకి చెందిన ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ అకాడమీ (ఐపీటీఎస్‌ఈ) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

ఏయూతో ఐపీటీఎస్‌ఈ అకాడమీ ఎంవోయూ
వీసీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను చూపుతున్న రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌

ఏయూ క్యాంపస్‌, జూన్‌ 14: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో న్యూఢిల్లీకి చెందిన ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ అకాడమీ (ఐపీటీఎస్‌ఈ) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. సోమవారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌, ఐపీటీఎస్‌ఈ ప్రతినిధి సౌరభ్‌ సచ్‌దేవ్‌లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐపీ కల్చర్‌ను పెంపొందించడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని, ఏపీలోని విద్యా సంస్థల్లో మేధోహక్కులు, పేటెంట్లు సాధించడంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పరిశ్రమల నుంచి వచ్చి వర్సిటీలో పీహెచ్‌డీ చేసేవారు తప్పనిసరిగా పేటెంట్‌కు దరఖాస్తు చేసేలా నిబంధనలలను మార్పు చేస్తామని  పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ పురషోత్తం, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-15T05:32:10+05:30 IST