పంజాబ్ కొత్త DGPగా వీకే భావ్రా

ABN , First Publish Date - 2022-01-08T20:57:12+05:30 IST

పంజాబ్ కొత్త డీజీపీగా వీకే భావ్రాను చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం శనివారంనాడు..

పంజాబ్ కొత్త DGPగా వీకే భావ్రా

చండీగఢ్: పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భావ్రాను చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం  శనివారంనాడు నియమించింది. ఇంతవరకూ డీజీపీగా ఉన్న సిద్ధార్ధ్ ఛటోపాధ్యాయను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో డీజీపీగా వీకే భావ్రాను నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులో ప్రకటించింది. ఆయన నియామకాన్ని సీఎం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ముగ్గురు అధికారుల ప్యానల్ షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ భావ్రాను పంజాబ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. భావ్రా రెండేళ్ల పాటు డీజీపీగా ఉంటారు. పంజాబ్‌లోనూ, కేంద్ర ఐబీలోనూ భావ్రా కీలక సేవలు అందించారు.

Updated Date - 2022-01-08T20:57:12+05:30 IST