సంపత్‌నంది కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తూ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వేేస్టషన్’. వశిష్ట సింహ, హెబా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ కీలక పాత్రధారులు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ అనుదీప్‌గా సాయి రోనక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ ‘ఓదెల’ గ్రామంలో జరిగినసంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.