Advertisement
Advertisement
Abn logo
Advertisement

అదానీ విల్మార్‌ ఐపీఓ సైజు తగ్గింపు

వంటనూనెల కంపెనీ అదానీ విల్మార్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సైజును రూ.4,500 కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు తగ్గించుకుంది. కంపెనీ ఈ నెలలోనే ఐపీఓను ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్‌, సింగపూర్‌కు చెందిన విల్మార్‌ గ్రూప్‌ సంయు క్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ కంపెనీ ఫార్చూన్‌ పేరుతో వంటనూనె ఉత్పత్తులను విక్రయిస్తోంది. 


ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.166-175

చెల్లింపుల సేవల కంపెనీ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని కంపెనీ రూ.166-175గా నిర్ణయించింది. 

Advertisement
Advertisement