‘కరోనా వైరస్ పాతదే.. ఇలా చేస్తే కట్టడి చేయొచ్చు’

ABN , First Publish Date - 2020-03-31T23:32:27+05:30 IST

కరోనా వైరస్ పాతదేనని కొత్త కోరలతో ప్రపంచాన్ని వణికిస్తోందని..

‘కరోనా వైరస్ పాతదే.. ఇలా చేస్తే కట్టడి చేయొచ్చు’

హైదరాబాద్ : కరోనా వైరస్ పాతదేనని కొత్త కోరలతో ప్రపంచాన్ని వణికిస్తోందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్స్‌(ఐపీఎం) సంస్థ డైరెక్టర్‌ డా. శంకర్‌ పేర్కొన్నారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. కరోనాతో మృతిచెందిన వారిలో ఎక్కువ మందికి ఇతర వ్యాధులు ఉన్నాయన్నారు.


కరోనాలాంటి అనేక వైరస్‌లను దిగ్విజయంగా ఎదుర్కొన్నామని.. ప్రజలు లాక్‌డౌన్‌ను సరిగా పాటిస్తే కరోనాను వైరస్‌ వ్యాప్తిని నివారించొచ్చని శంకర్ తెలిపారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అదే విధంగా ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతా చర్యలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కరోనా వల్ల మరణాల సంఖ్య 2 నుంచి 3 శాతమేనని ఆయన మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-03-31T23:32:27+05:30 IST