పరిహారం ఇవ్వలేం

ABN , First Publish Date - 2020-08-09T09:08:27+05:30 IST

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌ప నుంచి వివో వైదొలగడంతో మరో స్పాన్సరర్‌ కోసం బీసీసీఐ వేటలో ఉంది. మరోవైపు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ..

పరిహారం ఇవ్వలేం

 ఫ్రాంచైజీలకు బీసీసీఐ స్పష్టీకరణ

ముంబై: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌ప నుంచి వివో వైదొలగడంతో మరో స్పాన్సరర్‌ కోసం బీసీసీఐ వేటలో ఉంది. మరోవైపు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ద్వారా లభించే మొత్తం నుంచి తమకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందేమోనని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. ఫలితంగా తమకు ఎంతోకొంత పరిహారం చెల్లించాలని బోర్డును ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. కానీ బీసీసీఐతోపాటు ఐపీఎల్‌ పాలకమండలి అందుకు ససేమిరా అంటున్నాయి. ‘ఈసారి ఐపీఎల్‌ జరగకపోతే అసలు ఆదాయమే ఉండేది కాదు. అలాంటిది టోర్నీ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎంతోకొంత ఆదాయం లభిస్తుంది కదా’ అన్నది బోర్డు వాదనట. కాగా..తమ నుంచి అందాల్సిన 20 శాతం వాటాను ఈసారి బోర్డు వదులుకోవాలని ఓ ఫ్రాంచైజీ యజమాని కోరారు. కానీ అది కూడా కుదరదని బీసీసీఐ స్పష్టం చేసినట్టు తెలిసింది. టిక్కెట్ల ద్వారా లభించే ఆదాయాన్ని కోల్పోతున్న ఫ్రాంచైజీలకు అందుకు సంబంధించిన పరిహారం కూడా అందజేయబోమని కూడా తెలిపింది. 

కిట్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులో ప్యూమా

జర్మనీకి చెందిన దుస్తులు, పాదరక్షల ప్రఖ్యాత సంస్థ ప్యూమా.. భారత జట్టు కిట్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులోకొచ్చింది. అలాగే మరో ప్రముఖ సంస్థ అడిడాస్‌ కూడా రంగంలోకి దిగే అవకాశాలు న్నాయి. ప్రస్తుతం టీమిండియా కిట్‌ స్పాన్సరర్‌ నైకీ మళ్లీ బిడ్‌ వేస్తుందో లేదో స్పష్టం కాలేదు. 2016 నుంచి 2020 వరకు.. ఐదేళ్ల కాలానికి రూ. 400 కోట్లు నైక్‌ చెల్లించింది. కానీ ఈసారి బిడ్‌ విలువను బీసీసీఐ తగ్గించడాన్ని నైకీ వ్యతిరేకిస్తోంది. టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.87.43 లక్షలు నైకీ చెల్లించింది. ప్రస్తుతం దానిని రూ. 61 లక్షలకు బీసీసీఐ కుదించింది. ఈనేపథ్యంలో నైకీ మళ్లీ బిడ్‌ దాఖలు చేస్తుందా.. లేదా అన్నది చూడాలి. 

Updated Date - 2020-08-09T09:08:27+05:30 IST