18న ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం?

ABN , First Publish Date - 2021-01-23T09:29:39+05:30 IST

తాజా ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. అయితే వేదిక ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించలేదని

18న ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం?

న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. అయితే వేదిక ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఈసారి లీగ్‌ను భారత్‌లో నిర్వహిస్తారా? లేక విదేశాల్లో జరుగుతుందా? అనేది కూడా తేలాల్సి ఉంది. ఈనెల 20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోయింది. ఆయా జట్లు పలువురు ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగుస్తుంది.


100 కోట్ల క్లబ్‌లో డివిల్లీర్స్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీర్స్‌ ఐపీఎల్‌ వేతనం రూ.100 కోట్లకు చేరింది. దీంతో ఈ ఫీట్‌ సాధించిన తొలి విదేశీ ఆటగాడయ్యాడు. ఐపీఎల్‌-14వ సీజన్‌ కోసం రూ.11 కోట్లతో ఈ స్టార్‌ ఆటగాడిని ఆర్‌సీబీ అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో 2008 నుంచి ఇప్పటివరకు అతడి సంపాదన మొత్తం రూ.102.5 కోట్లకు చేరింది.


చెన్నైకి ఊతప్ప: రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప ఇక నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడనున్నాడు. ట్రేడింగ్‌ విండోలో భాగంగా అతడిని సీఎ్‌సకే తీసుకుంది. తమకు ఓపెనర్ల విషయంలో ఇబ్బంది లేదని, చెన్నై నుంచి ఆఫర్‌ రాగానే ఊతప్పను వదిలేశామని రాజస్థాన్‌ ప్రకటించింది. అలాగే ఊతప్పకు సీఎ్‌సకే ఆరో ఫ్రాంచైజీ కానుంది. మరోవైపు తమను వేలానికి అందుబాటులో ఉంచడం ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఢిల్లీ ఆటగాడు అలెక్స్‌ క్యారీ, ముంబై పేసర్‌ కల్టర్‌నైల్‌ తెలిపారు.

Updated Date - 2021-01-23T09:29:39+05:30 IST