రాజస్థాన్‌కే శాంసన్‌

ABN , First Publish Date - 2021-11-27T08:52:50+05:30 IST

వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం డిసెంబరులో భారీ ఆటగాళ్ల వేలం ఉండబోతోంది. బీసీసీఐ అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా తొలివారం ఈ ప్రక్రియ జరగనున్నట్టు సమాచారం.

రాజస్థాన్‌కే శాంసన్‌

  • ‘రిటైన్‌’ జాబితాకు తుదిగడువు ఈనెల 30 
  • వచ్చేనెలలో ఆటగాళ్ల వేలం


న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం డిసెంబరులో భారీ ఆటగాళ్ల వేలం ఉండబోతోంది. బీసీసీఐ అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా తొలివారం ఈ ప్రక్రియ జరగనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతమున్న ఎనిమిది ఫ్రాంచైజీలకు నలుగురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇచ్చింది. ఏ జట్టు ఎవరిని కాపాడుకుంటుందనే విషయం ఈనెల 30లోగా బీసీసీఐకి తెలపాల్సి ఉంది. తాజాగా రాజస్థాన్‌ తమ రిటైన్‌ ఆటగాడిని ప్రకటించింది. శాంసన్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు నిర్ణయించింది.


దీంతో అతడికి తొలి ప్రాధాన్యత ఆటగాడిగా సీజన్‌కు రూ.14 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టు కథనం. అలాగే బట్లర్‌, ఆర్చర్‌,  యశస్వీ జైశ్వాల్‌లను కూడా రిటైన్‌ చేసుకోబోతోంది. వేలంలో క్రికెటర్ల కొనుగోలుకు ప్రతీ జట్టు 90 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే సన్‌రైజర్స్‌ తరఫున స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రాతినిధ్యం సందేహంగానే ఉంది. పంజాబ్‌ నుంచి రాహుల్‌ కొత్త జట్టు లఖ్‌నవూకు వెళ్లే అవకాశం ఉంది. 


రిటైన్‌ చేసుకునే ఆటగాళ్లు

చెన్నై: ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్‌, మొయిన్‌ అలీ/ సామ్‌ కర్రాన్‌

ముంబై: రోహిత్‌, బుమ్రా, పొలార్డ్‌, ఇషాన్‌

ఢిల్లీ: రిషభ్‌ పంత్‌, అక్షర్‌, పృథ్వీ షా, నోకియా

బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌

కేకేఆర్‌: నరైన్‌, రస్సెల్‌, వరుణ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌. 

Updated Date - 2021-11-27T08:52:50+05:30 IST