Abn logo
Apr 9 2020 @ 21:57PM

ఐపీఎల్.. అసంభవం: మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యమని ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. కరోనాతో పోరాడి ప్రజలను కాపాడడమే ప్రస్తుత కర్తవ్యమని, ప్రభుత్వ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుందని ఆయన్నారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను కూడా మరింత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని, దీనిని బట్టి ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమనే చెప్పాలని శుక్లా వ్యాఖ్యానించారు. దీనికి తోడు దేశంలోకి విదేశీయుల రావడంపైనా ప్రభుత్వం నిషేధం విధించిందని, మార్చి 11 నుంచి ఇండియాకు వచ్చేందుకు అనుమతి ఉన్న అన్ని వీసాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని, దీనివల్ల ఇతర దేశాల ఆటగాళ్లు కూడా మన దేశానికి వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తన దృష్టికి రాలేదని శుక్లా చెప్పుకొచ్చారు. వీటన్నింటి ఆధారంగా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అసంభవంగానే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement