Abn logo
Apr 13 2021 @ 00:16AM

పురంలో జోరుగా ‘ఐపీఎల్‌’ బెట్టింగ్‌

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 12: జిల్లాలోనే వాణిజ్యకేంద్రంగా పేరుగాంచిన హిందూపురంలో క్రికెట్‌ వచ్చిందంటే బెట్టింగ్‌ తప్పనిసరిగా సాగుతుంది. చిన్నాపెద్ద తేడాలేకుండా అందరూ అన్ని వయసులవారు క్రికెట్‌పై బెట్టింగ్‌ కాస్తారు. ప్రస్తుతం ఐపీఎల్‌ 14వ సీజన ప్రారంభం కావడంతో బెట్టింగ్‌ రాయుళ్లు వారిపని వారు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ మే ఆఖరు వరకు జరుగుతుండటంతో పట్టణంలో ఏ ఇద్దరు యు వకులు కలిసినా ఐపీఎల్‌పై చర్చ. గతంలో ఐపీఎల్‌ మ్యాచలు జరిగినప్పుడు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను పోలీసులు అరె్‌స్టచేసి నగదును స్వాధీనం చేసుకున్న ఘటనలు ఎన్నోఉన్నాయి. హిందూపురంలో క్రికెట్‌ మ్యాచలు ప్రారంభానికి ముందునుంచే బెట్టింగ్‌ ఆడేవారు వారివారి టీమ్‌లతో సిద్దం అవుతుంటారు. ముఖ్యంగా ముద్దిరెడ్డిపల్లి, రహమతపురం, శ్రీకంఠపురం, టీచర్స్‌కాలనీ, కోట, చిన్నమార్కెట్‌, త్యాగరాజ్‌నగర్‌, గుడ్డం ప్రాంతాల్లో అధికంగా క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు అధికంగా ఉ న్నారు. మూడు రోజుల నుంచి ప్రతిరోజూ అరకోటికి పైగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు నిఘా వేసినా వారి కన్నుగప్పి బెట్టింగ్‌ పా ల్పడుతున్నారు. అయితే అధికశాతం ఆనలైన, సెల్‌ఫోన ద్వారా బాల్‌టు బాల్‌, ఓవర్‌టు ఓవర్‌ బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ బెట్టింగ్‌ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకింది. మ్యాచ ప్రా రంభమైందంటే ముగిసే వరకు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు సెల్‌ఫోనద్వారానే పందెం కాస్తున్నారు. యువకులు మ్యాచ జరిగే సమయంలో పట్టణం బయటకు వెళ్లి లైవ్‌ టు లైవ్‌లో బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న విషయం పోలీస్‌ కిందిస్థాయి సిబ్బందికి తెలిసినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీస్‌ కిందిస్థాయి సిబ్బంది బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆశాఖలో చర్చ సాగుతోంది.


Advertisement
Advertisement
Advertisement