చెన్నైలో ఆరంభం.. మొతేరాలో ముగింపు

ABN , First Publish Date - 2021-03-08T09:14:50+05:30 IST

ఐపీఎల్‌ 14వ అంచె పూర్తిగా స్వదేశంలోనే జరగనుంది. దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో.. వచ్చే నెల 9 నుంచి మే 30..

చెన్నైలో ఆరంభం..  మొతేరాలో ముగింపు

ఆరు వేదికలు..

56 లీగ్‌ మ్యాచ్‌లు

ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌

తొలి దశ మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే

కరోనా విజృంభిస్తున్న ముంబైలోనూ మ్యాచ్‌లు


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 14వ అంచె పూర్తిగా స్వదేశంలోనే జరగనుంది. దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో.. వచ్చే నెల 9 నుంచి మే 30 వరకు జరిగే ఐపీఎల్‌ షెడ్యూల్‌ను పాలక మండలి ఆదివారం విడుదల చేసింది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌తోపాటు కరోనా విజృంభిస్తున్న ముంబైనీ వేదికగా ఖరారు చేశారు. ఏ జట్టూ తమ సొంత గడ్డపై ఒక్క మ్యాచ్‌కూడా ఆడబోదు. కొవిడ్‌ కారణంగా తొలి దశ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. దీనిపై పరిస్థితులను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పారు. చెన్నైలో జరిగే లీగ్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఏప్రిల్‌ 11న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాతో హైదరాబాద్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. 


11 డబుల్‌ హెడర్స్‌..:

ప్రతి టీమ్‌ నిర్ణయించిన ఆరు వేదికల్లో.. నాలుగు చోట్ల ఆడాల్సి ఉంటుంది. లీగ్‌ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై, బెంగళూరుల్లోనే పదేసి మ్యాచ్‌లు ఆడనున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో 8 మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. తొలి 36 లీగ్‌ మ్యాచ్‌లను చెన్నై, అహ్మదాబాద్‌, ముంబై, ఢిల్లీ మధ్య విభజించారు. మిగిలిన 20 మ్యాచ్‌లను మే నెలలో బెంగళూరు, కోల్‌కతాలో షెడ్యూల్‌ చేశారు. బెంగాల్‌లో ఎన్నికలు, చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు మారుస్తున్నందున కొంత ఆలస్యంగా మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు 11సార్లు జరగనున్నాయి. ఆరు జట్లు మూడు చొప్పున, రెండు టీమ్‌లు రెండేసి చొప్పున మధ్యాహ్నం మ్యాచ్‌లు ఆడనున్నాయి. గతేడాదిలాగే మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7.30కి ఆరంభం కానున్నాయి. 


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థి వేదిక

ఏప్రిల్‌ 11 కోల్‌కతా చెన్నై

ఏప్రిల్‌ 14 బెంగళూరు చెన్నై

ఏప్రిల్‌ 17 ముంబై చెన్నై

ఏప్రిల్‌ 21గీ పంజాబ్‌ చెన్నై

ఏప్రిల్‌ 25 ఢిల్లీ చెన్నై

ఏప్రిల్‌ 28 చెన్నై ఢిల్లీ

మే 2గీ రాజస్థాన్‌ ఢిల్లీ

మే 4 ముంబై ఢిల్లీ

మే 7 చెన్నై ఢిల్లీ

మే 9 బెంగళూరు కోల్‌కతా

మే 13 రాజస్థాన్‌ కోల్‌కతా

మే 17 ఢిల్లీ కోల్‌కతా

మే 19 పంజాబ్‌ బెంగళూరు

మే 21గీ కోల్‌కతా బెంగళూరు

(స్టార్‌ గుర్తున్నవి మధ్యాహ్నం 3.30 గంటల మ్యాచ్‌లు)

Updated Date - 2021-03-08T09:14:50+05:30 IST