IPL 2022 Playoffs Scenario : మిగిలింది 3 మ్యాచ్‌లే.. ఇవీ ప్లే ఆఫ్ సమీకరణాలు..

ABN , First Publish Date - 2022-05-20T22:42:32+05:30 IST

ఐపీఎల్ 2022 (IPL2022) సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. లీగ్ దశలో కేవలం 3 మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ప్లే ఆఫ్ ఆడబోయే జట్లు ఏవో ఇం

IPL 2022 Playoffs Scenario : మిగిలింది 3 మ్యాచ్‌లే.. ఇవీ ప్లే ఆఫ్ సమీకరణాలు..

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 (IPL2022) సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. లీగ్ దశలో కేవలం 3 మ్యాచ్‌లే మిగిలివున్నా ప్లే ఆఫ్స్ ఆడబోయే జట్లు ఏవో ఇంకా క్లారిటీ రాలేదు. గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుచేసుకుంది. ప్రస్తుతం 16 పాయింట్లు లేదా 8 విజయాలతో నాలుగవ స్థానంలో ఉన్నా ప్లే ఆఫ్‌ బెర్త్‌కు గ్యారంటీ లేదు. అయితే ఆర్‌సీబీ గెలుపు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల ప్లే ఆశలపై నీళ్లు జల్లింది. ఆర్‌సీబీ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. కాగా మెగా టోర్నీలో కొత్త జట్లుగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్(10 గెలుపులు), లక్నో సూపర్ జెయింట్స్(9 విజయాలు) ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అధికారికంగా చేరుకున్నాయి. గుజరాత్‌కు అగ్రస్థానం డిసైడ్ అయ్యింది. లక్నో రెండవ స్థానంలో ఉంది. అయితే ప్లే ఆఫ్‌కు చేరుకునే మిగిలిన రెండు జట్ల ఏవి, ఏయే స్థానాల్లో ఆడబోతున్నాయే అంశాలపై స్పష్టత రావాలంటే మాత్రం శుక్రవారం, శనివారం రాత్రి జరగబోయే మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ఏవి, ఫలితం ఎలా ఉంటే ఏ జట్టుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒకసారి విశ్లేషిద్దాం..


ఈ సీజన్ లీగ్ దశలో చివరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆదివారం రాత్రి జరగనుంది. ప్లే ఆఫ్ సమీకరణాలు మారిపోవడంతో ఈ రెండు జట్ల మధ్య జరగబోయేది మొక్కుబడి మ్యాచ్ మాత్రమే. ఈ రెండు జట్లకు చెరో 12 పాయింట్లు ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. కానీ ప్రయోజనం లేదు. కనీసం 16 పాయింట్లు ఉన్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్‌కు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించాయి.


ముంబైపై ఢిల్లీ మ్యాచ్ కీలకం..

శుక్రవారం (ఈ రోజు) రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఎంతో కీలకం కాబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు స్పష్టమైన సమీకరణం ఒక్కటే ఉంది. అదేంటంటే శనివారం జరగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కచ్చితంగా గెలవాలి. లేదంటే 14 పాయింట్లతో టోర్నీ లీగ్ దశ నుంచి నిష్ర్కమించినట్టే అవుతుంది. ప్రస్తుతం 14 పాయింట్లు 0.255 రన్‌రేటుతో ఐదవ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోతే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎలాంటి ఢోకా ఉండదు. నాలుగవ స్థానంలో ప్లే ఆఫ్ ఆడుతుంది. ఢిల్లీ గెలిస్తే రన్‌రేటును బట్టి 3 లేదా 4వ స్థానం దక్కుంది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్ ఫలితం ఆధారంగా. 


2, 3 స్థానాలు తేలేది ఈ మ్యాచ్‌తోనే..

ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా బెంగళూరు మాదిరిగానే 16 పాయింట్లతో ఉంది. అయితే 0.304 మెరుగైన నెట్‌ రన్ రేటుతో ఉండడం ఈ జట్టుకు సానుకూలం. అయితే తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్‌లో టాప్-2 బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ప్రస్తుతం 9 విజయాలతో 2వ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ రన్ రేటు రాజస్థాన్ రాయల్స్ కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ ఓడిపోయి.. ఇదే సమయంలో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఇరు జట్లు 16 పాయింట్లతోనే ఉంటాయి. అయితే మెరుగైన రన్ రేటును బట్టి 3, 4 స్థానాల్లో ఎవరుంటారనేది తేలిపోద్ది. ఒక ఢిల్లీ ఓడిపోతే మాత్రం 4వ స్థానం ఆర్సీబీకే దక్కుతుంది. రన్ రేటు రుణాత్మకంగా ఉండడమే ఇందుకు కారణం.

Updated Date - 2022-05-20T22:42:32+05:30 IST