Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 28 Mar 2022 21:37:06 IST

దీపక్ హుడా, ఆయుష్ బదోని సూపర్ షో.. పరువు కాపాడుకున్న లక్నో

twitter-iconwatsapp-iconfb-icon
దీపక్ హుడా, ఆయుష్ బదోని సూపర్ షో.. పరువు కాపాడుకున్న లక్నో

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పరువు కాపాడుకుంది. తొలుత 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో 100 పరుగులు కూడా దాటడం కష్టమనుకున్న వేళ దీపక్ హుడా, ఆయుష్ బదోని క్రీజులో నిలబడి జట్టును నిలబెట్టారు.


మహ్మద్ షమీ దెబ్బకు కేఎల్ రాహుల్ (0), క్వింటన్ డికాక్ (7), మనీష్ పాండే (6) వంటి మ్యాచ్‌ను మలుపుతిప్పగల బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో లక్నో పని అయిపోయిందని అందరూ భావించారు. అయితే, అదే సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, ఆయుష్ బదోని జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.


తొలుత ఇద్దరూ నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. వీరి జోడీని విడగొట్టేందుకు గుజరాత్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.


హుడా 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో  55 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ప్రత్యర్థికి ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసుకోగా, వరుణ్ అరోన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.