అబుదాబి: ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు తరపున ఇద్దరు కొత్త ఆటగాళ్లు కేఎస్ భరత్, వనిందు హసరంగ అరంగేట్రం చేస్తున్నారు. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో బ్లూ జెర్సీ ధరించి ఆడనుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఫ్రంట్లైన్ వర్కర్లకు సంఘీభావంగా ఈ జెర్నీని ధరిస్తోంది.