Abn logo
Sep 21 2021 @ 19:20PM

IPL 2021: టాస్ గెలిచిన పంజాబ్.. అభిమానులకు నిరాశ

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇది 32వ మ్యాచ్. రెండో దశలో మూడో మ్యాచ్. వికెట్‌పై పచ్చిక ఉండడంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్టు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నామని అన్నాడు. జట్టులో పూరన్, మార్కరమ్, రషీద్, అలెన్‌లు విదేశీ ఆటగాళ్లని తెలిపాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఆడడం లేదని రాహుల్ తెలిపాడు. గేల్ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త నిరాశ కలిగించేదే.


ప్రత్యర్థికి మంచి టార్గెట్ ఇస్తామని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు. జట్టులో లూయిస్, లివింగ్‌స్టోన్, మోరిస్, ముస్తాఫిజర్ విదేశీ ఆటగాళ్లని తెలిపాడు.