షార్జా: ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇసుక తుపాను కారణంగా టాస్ అరగంటకుపైగా ఆలస్యమైంది. తొలి మ్యాచ్‌లో ముంబైతో తలపడిన జట్టుతోనే ధోనీ సేన బరిలోకి దిగుతోంది. కోహ్లీ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. సచిన్ బేబీ స్థానంలో నవ్‌దీప్ సైనీ జట్టులోకి రాగా, జెమీసన్ స్థానంలో టిమ్ డేవిడ్ జట్టులోకి వచ్చాడు.