Abn logo
Aug 15 2020 @ 06:02AM

ఐపీఎల్‌కు ముందు తెల్ల గ‌డ్డంతో విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీపిఎల్) 13 వ సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేప‌ధ్యంలో అన్ని ఫ్రాంచైజ్ జట్లు ఐపీఎల్ సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. వచ్చే వారం నుంచే జట్లు యూఏఈకి బయలుదేరనున్నాయి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆగస్టు 21 న దుబాయ్ బయలుదేర‌నుంది. ఆ తరువాత ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆగస్టు మూడవ లేదా నాలుగ‌వ‌ వారంలో యూఏఈకి చేరుకోనున్నాయి. ఈ టోర్నమెంట్ సన్నాహాల మధ్య టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో అత‌ను తెల్లబ‌డిన‌ గడ్డంతో కనిపిస్తున్నారు. విరాట్ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఫోటో కింద‌ మంచి ట్రైనింగ్ సెష‌న్ నాకు సంతోషాన్నిస్తోంది అని రాశారు. కాగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని నిర్ణయించినప్పటికీ, కోవిడ్ -19 కారణంగా వాయిదా పడింది. ఈసారి ఐపీఎల్  మ్యాచ్‌లు షార్జా, దుబాయ్, అబుధాబిలలో జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement
Advertisement
Advertisement