Abn logo
Jun 5 2021 @ 00:07AM

ఐఫోన్‌ న్యూ ఫీచర్స్‌

ఐఫోన్ల కోసం యాపిల్‌ ఇటీవలే ఐఓఎస్‌ 14.6 సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసింది. తద్వారా ఐఫోన్ల వినియోగంలో మరింత టెక్నాలజీని, స్మార్ట్‌నెస్‌ను జోడించింది.  ఈ కొత్త ఫీచర్లు బెటర్‌ ప్రైవసీ అంతకు మించి పర్సనలైజేషన్‌కు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 


 ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభంలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘అన్‌లాక్‌ విత్‌ యాపిల్‌ వాచ్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మాస్క్‌ ధరించినప్పుడు దీని ద్వారా యాపిల్‌ వాచ్‌తో ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేయవచ్చు. సెట్టింగ్స్‌ - ఫేస్‌ ఐడి - పాస్‌ కోడ్‌తో  ఈ పని చేయవచ్చు. యాపిల్‌ వాచ్‌ని అదే ఐఫోన్‌తో సింక్‌ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం కూడా ఉంది. యాపిల్‌ వాచ్‌ లేనిపక్షంలో ఫేస్‌ ఐడీని డిజేబుల్‌ చేయాలి. స్ర్కీన్‌ లాక్‌ కోసం నాలుగు అంకెల పాస్‌కోడ్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. 


కొత్త అప్‌డేట్‌తో డిఫాల్ట్‌గా ఉన్న ‘సిరి’ ఫిమేల్‌ వాయిస్‌ను మార్చుకోవచ్చు.  ఇప్పుడు సిరి వాయిస్‌లతో అందుబాటులో ఉంది. అందులో నుంచి తమకు కావాల్సిన ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌ - సిరి అండ్‌ ఆప్షన్స్‌లోకి వెళితే నాలుగూ కనిపిస్తాయి. మీ ప్రాధాన్యం ప్రకారం నచ్చింది ఎంచుకోవచ్చు. 


హోమ్‌ స్ర్కీన్‌కీ న్యూ లుక్‌ తెచ్చుకోవచ్చు. షార్ట్‌కట్స్‌ యాప్స్‌తో ఐఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌ని భిన్నంగా మార్చుకోవచ్చు. లుక్‌ మార్చాలనుకుంటే న్యూ ఐకాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా యాప్‌ ఐకాన్‌లను చేంజ్‌ చేసుకోవచ్చు. అలా డిఫాల్ట్‌గా ఉండే ఐకాన్‌ను తీసేయవచ్చు. 


ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేసుకునే సమయంలో లేదా మెసేజ్‌లను చదువుకుంటున్నప్పుడు వీడియోలను ఇప్పుడు చూడొచ్చు. దీని కోసం కొత్తగా ‘పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌’ మోడ్‌ను పరిచయం చేసింది.  


మెయిల్‌, సఫారికి ఉన్న డిఫాల్ట్‌ యాప్‌ను మార్చుకోవచ్చు. తద్వారా క్రోమ్‌ను బ్రౌజ్‌ చేయకుండానే జీమెయిల్‌, ఔట్‌లుక్‌లో ఉండే మెయిల్స్‌ చూసుకోవచ్చు. అందుకోసం సదరు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి క్రోమ్‌ లేదా ఔట్‌లుక్‌ కోసం సెర్చ్‌ చేయాలి. దాన్ని ఓపెన్‌ చేస్తే డిఫాల్ట్‌ బ్రౌజర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకోవచ్చు. అదే మాదిరిగా జీమెయిల్‌ ఇన్‌సైడ్‌ సెట్టింగ్స్‌లోనూ ఉంటుంది. 


మిమ్మల్ని ట్రాక్‌ చేసే యాప్స్‌ను ఆపివేయవచ్చు. ఆన్‌లైన్‌ ప్రకటనల కోసం మిమ్మల్ని ట్రాక్‌ చేయకుండా నిలిపే కొన్ని యాప్‌లకు అనుమతిని నిరాకరించే సౌకర్యం ఇప్పుడు వచ్చింది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయగానే ట్రాకింగ్‌ చేయవచ్చా వద్దా అని యాపిల్‌ అడుగుతుంది. వెంటనే మీరు దాన్ని డిజేబుల్‌ చేసేయవచ్చు. అందుకోసం ప్రత్యేకించి ఉన్న యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ట్రాకింగ్‌ను డిజేబుల్‌ చేయవచ్చు. 


ఐఫోన్‌ వినియోగదారులకు న్యూ పాడ్‌కాస్ట్‌లను యాపిల్‌ పరిచయం చేసింది. వీటితో కొత్త సబ్‌స్ర్కిప్షన్‌ వేదికను పొందవచ్చు. దీనితో పెయిడ్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌ను వినియోగదారులకు ఆఫర్‌ చేయవచ్చు. యాడ్‌ ఫ్రీ ఎపిసోడ్లు, సబ్‌స్ర్కైబర్‌ ఎపిసోడ్లను అనుమతించవచ్చు.


ఐఫోన్‌ 11 సిరీస్‌ వినియోగదారులు ప్రస్తుతం అందించిన ఈ కొత్త ఫీచర్‌తో డివైజ్‌ వాస్తవ కెపాసిటీ, పర్ఫార్మెన్స్‌ తెలుసుకోవచ్చు. ఐఓఎస్‌ 14.5తో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. బ్యాటరీ రియల్‌ కండిషన్‌ దీంతో తెలుస్తుంది. సెట్టింగ్స్‌ మెనూలోకి వెళితే బ్యాటరీ పరిస్థితి అవగతమవుతుంది. ఇక్కడి నుంచి బ్యాటరీని రీకాలిబ్రేట్‌ చేయవచ్చు. 


పాటలను గుర్తించేందుకు టోగెల్‌గా ఇంతవరకు షాజెమ్‌ పని చేసింది.  ఐఎస్‌ 14.6తో వినియోగదారులు పాటకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ప్రక్రియలో మార్పులేనప్పటికీ ఐఫోన్‌లో ఉన్న షాజమ్‌ క్లిప్‌ యాప్‌ ఇప్పుడు ఈ అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది. సెట్టింగ్స్‌ మెనూలో కంట్రోల్‌ సెంటర్‌ను కనుగొనాలి. లిస్ట్‌ ఆఫ్‌ కంట్రోల్స్‌ ఉన్న ‘మ్యూజిక్‌ రికగ్నిషన్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు స్వైప్‌ డౌన్‌ చేయాలి. అక్కడ ఉన్న షాజమ్‌ లోగో కనిపిస్తుంది.


ఐఫోన్ల్‌లో మ్యూజిక్‌కు సంబంధించి లిజనింగ్‌ క్వాలిటీని కూడా మెరుగుపర్చింది. స్పేషియల్‌ ఆడియో, డోల్‌బై ఆటమ్స్‌ సపోర్ట్‌, లాస్‌లెస్‌ మ్యూజిక్‌ వంటి ఫీచర్లన్నీ ఐఫోన్‌లో లభిస్తున్నాయి. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ పొందిన వినియోగదారులకు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. 

ప్రత్యేకం మరిన్ని...