Abn logo
Apr 9 2020 @ 22:05PM

15 రోజుల్లో 3.38 కోట్ల సిలిండర్లు డెలివరీ చేసిన ఐవోసీ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో వంటగ్యాస్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడానికి ఏప్రిల్, మే నెలలో వంటగ్యాస్‌ను అదనంగా దిగుమతి చేసుకుంటున్నట్టు భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గురువారం తెలిపింది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 50 శాతం అదనపు దిగుమతులు చేసుకుంటున్నట్టు పేర్కొంది.


లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఐవోసీ సిలిండర్లను సరఫరా చేస్తోంది. గత 15 రోజుల్లో ఏకంగా 3.38 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లను డెలివరీ చేసినట్టు తెలిపింది. ఈ లెక్కన రోజుకు 26 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నట్టు వివరించింది.  లాక్‌డౌన్/కర్ఫ్యూ/కంటైన్‌మెంట్‌తోపాటు ఇతర ఆంక్షలు ఉన్నప్పటికీ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ బాయ్‌లు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ సకాలంలో, పూర్తి రక్షణతో సిలిండర్లను డెలివరీ చేస్తున్నారని ఐవోసీ ప్రశంసించింది. 

Advertisement
Advertisement
Advertisement