Abn logo
Sep 28 2021 @ 02:58AM

బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

త్వరలో ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలో సీఎంను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనాలని విజయవాడ కనకదుర్గ ఆలయ అధికారులు, భ్రమరాంబ మల్లిఖార్జుస్వామి దసరా ఉత్సవాలకు హాజరుకావాలని శ్రీశైలం దేవస్థానం అధికారులు సీఎంను ఆహ్వానించారు.

క్రైమ్ మరిన్ని...