Abn logo
Sep 17 2021 @ 23:03PM

సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాలని సుప్రీం సీజేకు ఆహ్వానం

సీజే రమణకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న చినజీయర్‌స్వామి, జూపల్లి రామేశ్వర్‌రావు

  • రమణకు ఆహ్వాన పత్రిక అందజేసిన చినజీయర్‌స్వామి 

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని (216 అడుగులు) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శుక్రవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు సీజే ఎన్‌వీ రమణను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి, మైహోంగ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావులు ఆహ్వాన పత్రిక అందజేశారు. స్వామీజీ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని రమణ హామీ ఇచ్చినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.