Abn logo
Sep 27 2021 @ 23:10PM

దసరా ఉత్సవాలకు ఆహ్వానం

ముఖ్యమంత్రిని దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తున్న ఈవో ఎస్‌ లవన్న


 శ్రీశైలం, సెప్టెంబరు 27: శ్రీశైలం మహక్షేత్రంలో అక్టోబరు 7 నుంచి 15 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ముఖ్యకార్యదర్శి డా. జి.వాణీమోహన, శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్‌ లవన్న ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రికి స్వామిఅమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈవో లవన్న దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను దసరా మహోత్సవాలకు ఆహ్వానం పలికారు. 

 స్వామి, అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ

  శ్రీశైలం క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని  భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రాత్రి సహస్ర దీపాలంకరణ సేవను ఘనంగా జరిపారు. ముందుగా  స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేసి, అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. 

- శ్రీశైల మహక్షేత్రంలో లోకకళ్యాణం కోసం సోమవారం షష్ఠిని పురస్కరించుకొని  ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య(కుమారస్వామి) స్వామికి విశేష అభిషేకం, అర్చనలు  చేశారు.  అనంతరం  స్వామివారికి మంగళ హారతులు జరిపి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం, సుబ్రహ్మణ్యస్తోత్రం, పారాయణాలు  చేశారు. 

 శ్రీశైలంలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

 భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం రాత్రి మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. తరణి దర్శించుకున్నారు.  దర్శనార్థం వచ్చిన ఆమెకు  ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తికి వేదపం డితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.