జవహర్‌ నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-10-24T11:38:37+05:30 IST

మండలంలోని చలకుర్తి జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కేవీ.నాగరాజ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

జవహర్‌ నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దవూర, అక్టోబరు23 : మండలంలోని  చలకుర్తి జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కేవీ.నాగరాజ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు చెందిన పాఠశాలలో ఐదో తరగతి చదవడంతో పాటు, 01-05- 2008మరియు 31-04-2012సంవత్సరంలో జన్మించిన వారై ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలను డిసెంబర్‌ 15, 2020 వరకు అందించవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. దరఖాస్తు ఫారా లు నవోదయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. మిగిలిన వివరాల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. జెఎన్‌వీ నల్లగొ ండ వైబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Updated Date - 2020-10-24T11:38:37+05:30 IST