Abn logo
Sep 26 2021 @ 00:36AM

పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఏయూ క్యాంపస్‌, సెప్టెంబరు 25: ఆంధ్ర విశ్వవిద్యాలయం, బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పీజీ, పీజీ డిప్లొమా (సెల్ఫ్‌ సపోర్టెండ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏయూ ప్రవేశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి గల మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును నిర్వహిస్తున్నామని, ఏదైనా డిగ్రీ చదివినవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఏడాది కాలపరిమితితో పీజీ డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్‌ గ్యాస్ర్టోఎంట్రాలజీ టెక్నాలజీ కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ, బి-ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత కోర్సుల్లో  వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్‌కు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏయూ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిచేసిన వాటిని ఈ నెల 30వ తేదీలోగా ఏయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, విజయనగర్‌ ప్యాలెస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నంలో అందజేయాలని కోరారు. రూ.500 అపరాధ రుసుంతో అక్టోబరు ఐదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ను అక్టోబరు 11న నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.


దూరవిద్య ఎమ్మెస్సీ పర్సనల్‌ కాంటాక్టు ప్రొగ్రామ్‌ వాయిదా

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య ఎమ్మెస్సీ సైకాలజీ ఫైనలియర్‌ పర్సనల్‌ కాంటాక్టు ప్రొగ్రామ్‌ మొదటి విడత కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఏయూ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె. విశ్వేశ్వరరావు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమం ఈ నెల 27న జరగాల్సి ఉందని, మళ్లీ దీనిని ఎప్పుడు నిర్వహించేది వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 7702257813, 0891-2844164 ఫోన్‌ నంబర్లను సంప్రతించాలని కోరారు.