టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-09T10:21:37+05:30 IST

టీ-సేవా ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అర్హత ఆసక్తిగల అభ్యర్థుల ..

టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

బర్కత్‌పుర, జూలై 8(ఆంధ్రజ్యోతి): టీ-సేవా ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అర్హత ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవా సెంటర్‌ డైరెక్టర్‌ అడపవెంకట్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓబీసీలు ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులు, దివ్యాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళలకు 25శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజులో ప్రత్యేక తగ్గింపు ఇస్తామని తెలిపారు. ఈ నెల 25లోపు డబ్ల్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ టీ-సేవా సెంటర్‌ డాట్‌ కమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నెం.8179955744ను సంప్రదించాలని వెంకట్‌రెడ్డి తె లిపారు. 

Updated Date - 2020-07-09T10:21:37+05:30 IST