డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-02-25T04:59:49+05:30 IST

సాంఘిక సంక్షేమ, గిరిజన సం క్షేమ గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కళాశాలల్లో 2021- 2022 విద్యా సంవత్సరానికి బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఆంగ్లం మాధ్యమంలో డిగ్రీ కోర్సులు ప్రథమ సంవత్సరానికి ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో అలివేలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24: సాంఘిక సంక్షేమ, గిరిజన సం క్షేమ గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కళాశాలల్లో 2021- 2022 విద్యా సంవత్సరానికి బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఆంగ్లం మాధ్యమంలో డిగ్రీ కోర్సులు ప్రథమ సంవత్సరానికి ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో అలివేలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2020లో ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణులైన వారు, మే 21 లో జరగబోవు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకున్న విద్యా ర్థులు, చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్‌లో కనీసం 40శాతం, మార్కులు సాధించినవారు మాత్రమే అర్హులని, ఆసక్తి గల విద్యార్థులు ఎస్సీ ,ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ  వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు గురుకుల కళాశాల వెబ్‌సైట్‌ సందర్శించాలన్నారు. 

Updated Date - 2021-02-25T04:59:49+05:30 IST