ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-15T09:34:22+05:30 IST

ఎస్సీ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి. బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్‌ అర్బన్‌: ఎస్సీ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి. బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్‌ ప్లేట్ల తయారీకి రూ.1లక్ష, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ రూ.7.48 లక్షలు, పుట్టగొడుగుల పెంపకం, ఒంటరి మహిళల కోసం బ్యాక్‌ యార్డు ఫౌల్ర్టీ తదితర యూనిట్లు ఉన్నాయన్నారు. వ్యక్తిగత, గ్రూపు విభాగాల్లో అర్హులకు యూనిట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల ఎస్సీ యువత కుల, ఆదాయ దృవపత్రాలు, ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు (రేషన్‌కార్డు), రెండు ఫొటోలతో కలెక్టరేట్‌ బీబ్లాక్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9849532030లో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-08-15T09:34:22+05:30 IST