ఏఈవో పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-05-20T11:15:52+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 25 వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు

ఏఈవో పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 25 వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పద్ధతిపై ఔట్‌ సోర్సి ంగ్‌ ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తారని పేర్కొన్నారు. బీఎస్సీ (అగ్రికల్చరల్‌) విద్యార్హత ఉన్న వారికి 10 పోస్టులు, డిప్లొమా అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్సాలజీ విద్యార్హత ఉన్న వారికి 13 పోస్టులు, డిప్లొమా అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, బీటెక్‌ ఇంజనీరింగ్‌ అర్హత గల వారికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.


అర్హత గల అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 20 తేదీన ఉదయం 11 గంటల నుంచి 22న సాయంత్రం 4 గంటల లోపు దస్నాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురు ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈనెల 23వ తేదీన మెరి ట్‌ జాబితాను రూపొందించి ఉదయం 11 గంటల వరకు నోటీసు బోర్డుపై అతికించనున్నట్లు చెప్పారు. అదేరోజు సాయత్రం 4 గంటలలోపు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.


25వ తేదీన ఉదయం 11 గంటలకు ధ్రువపత్రాల పరిశీలన, ఎంపికైన వారి వివరాలను తెలియజేస్తామని అన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం రూ.17,500 నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నియామకం పూర్తి గా తాత్కాలికం,ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లా స్థానిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-20T11:15:52+05:30 IST