గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి పెట్టుబడుల వరద

ABN , First Publish Date - 2020-07-13T05:58:51+05:30 IST

మదుపరుల ఆలోచన మారుతోంది. కష్టకాలంలో స్టాక్‌ మార్కెట్‌, రుణ పత్రాలను నమ్ముకునే బదులు గోల్డ్‌ ఈటీఎ్‌ఫలను నమ్ముకోవడం మంచిదని భావిస్తున్నారు. దీంతో 2020 జూన్‌ నాటికి ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడు ల విలువ (ఏయూఎం) రూ.10,857 కోట్లకు చేరింది...

గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి పెట్టుబడుల వరద

న్యూఢిల్లీ: మదుపరుల ఆలోచన మారుతోంది. కష్టకాలంలో స్టాక్‌ మార్కెట్‌, రుణ పత్రాలను నమ్ముకునే బదులు గోల్డ్‌ ఈటీఎ్‌ఫలను నమ్ముకోవడం మంచిదని భావిస్తున్నారు. దీంతో 2020 జూన్‌ నాటికి ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడు ల విలువ (ఏయూఎం) రూ.10,857 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువని భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ (యాంఫీ) తెలిపింది. జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లోనూ గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో మదుపరులు భారీగానే మదుపు చేశారు. గత ఏడాది ప్రథమార్ధంలో ఈ పథకాల నుంచి రూ.160 కోట్లు వెనక్కి తీసుకున్న మదుపరులు.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ.3,530 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మార్చిలో కొద్దిగా ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించినా ఏప్రిల్‌ నుంచి మళ్లీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. కాగా కొవిడ్‌ కారణం గా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2020-07-13T05:58:51+05:30 IST