భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు NRI లకు ఉన్న మార్గాలివే..!

ABN , First Publish Date - 2022-01-26T01:38:04+05:30 IST

విదేశాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న అనేక మంది ఎన్నారైలు(NRI) భారత్‌లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. అనేక మందిలో తమకున్న పెట్టుబడి అవకాశాలు, మార్గాలపై సందేహాలు ఉంటాయి. మరి ఎన్నారైలకు ఉన్న పెట్టుబడి మార్గాలు ఏమిటో ఓ మారు తెలుసుకుందాం..

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు NRI లకు ఉన్న మార్గాలివే..!

విదేశాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న అనేక మంది ఎన్నారైలు(NRI) భారత్‌లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. అనేక మందిలో తమకున్న పెట్టుబడి అవకాశాలు, మార్గాలపై సందేహాలు ఉంటాయి. మరి ఎన్నారైలకు ఉన్న పెట్టుబడి మార్గాలు ఏమిటో ఓ మారు తెలుసుకుందాం.. 


ఆర్థిక నిపుణుల ప్రకారం.. భారతీయ పౌరులకు ఉన్న పెట్టుబడి మార్గాలన్నీ ఎన్నారైలకు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే.. కేవైసీ నిబంధనలు, వారు నివసించే దేశాల్లోని చట్టాల కారణంగా ఎన్నారై ఇన్వెస్ట్‌మెంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి వారు.. కంపెనీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లు, ఫోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు కళ్లజూడవచ్చు. 


భారతీయ కంపెనీ స్టాక్స్: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ద్వారా ఎన్నారైలు కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయవచ్చు.  ఎన్‌ఆర్ఈ లేదా ఎన్‌ఆర్ఓ అకౌంట్లకు అనుబంధంగా ఇన్వెస్ట్‌‌మెంట్ ఖాతాలు తెరిచి స్టాక్స్ కొనుగోలు చేయచ్చు. అయితే.. కంపెనీని బట్టి ఈ కొనుగోళ్లకు ఉన్న పరిమితులు మారుతుంటాయి. 


మ్యూచువల్ ఫండ్లు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా ఎన్నారైలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇందుకోసం కేవైసీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక అమెరికా లేదా కెనడాలో నివసించే వారికి మ్యూచువల్ ఫండ్స్‌ విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్‌ఏఎస్, యూటీఐ ఎమ్ఎఫ్ వంటి అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నారైలకు అవకాశం ఇస్తున్నాయి. 



పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు..ఈ సంస్థల ద్వారా ఎన్నారైలు కనీసం రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ ఇన్వె్స్ట్‌మెంట్ ఫండ్స్ ఎన్నారైలకు ఉన్న మరో మార్గం. ఎన్‌ఆర్ఈ లేదా ఎన్‌ఆర్ఓ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. వార్షిక వడ్డీ 5 నుంచి 5.4 శాతం మధ్య ఉండొచ్చు. ఎన్ఆర్‌ఐ డిపాజిట్లకు పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది. అయితే.. దీర్ఘకాలంలో జరిగే ఎక్స్‌ఛేంజ్ రేట్లలో జరిగే మార్పులు రాబడిపై ప్రభావం చూపిస్తాయి. రియల్ ఎస్టేట్ ట్రస్ట్/ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు ఎన్నారైలకున్న మరో అనువైన మార్గమని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-26T01:38:04+05:30 IST