ఆలయాలకు భక్తుల తాకిడి

ABN , First Publish Date - 2021-10-18T04:18:47+05:30 IST

దసరా వేడుకలు ముగిశాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఆలయాలకు తరలివచ్చారు.

ఆలయాలకు భక్తుల తాకిడి
నందవరంలో క్యూలైనలో భక్తులు

     

మహానంది, అక్టోబరు 17: దసరా వేడుకలు ముగిశాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. మహానంది, యాగంటి, నందవరం చౌడేశ్వరీమాత, ఓంకారం, ఆత్మకూరులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

- మహానంది క్షేత్రం ఆదివారం భక్త జనసంద్రంగా మారిపోయింది.  భక్తులకు దైవదర్శనం సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా దేవస్దానం సహాయ కార్యనిర్వహణాధికారి వై. మధు, టెంపుల్‌ ఇనస్పెక్టర్‌ సుబ్బారెడ్డిలు పర్యవేక్షించారు. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా పండుగ పురస్కరించుకొని కర్జాటక, ఏపీ రాషా్ట్రల నుంచి వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నందివర్గం ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూలైన్లను పర్యవేక్షించారు. భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో రామానుజన, చైర్మన పీ ఆర్‌ వెంకటేశ్వరరెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 

ఆత్మకూరులో వసంతోత్సవం 

ఆత్మకూరు అక్టోబరు 17: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వసంతోత్సవం నిర్వహించారు. పండుగ సాంప్రదాయం ప్రకారం విజయదశమి ముగిసిన మరుసటి రోజు  కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గ్రా మోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజున వసంతోత్సవంతో రంగులు చల్లుకుంటూ పండుగ విజయవంతమైందని ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా ఆర్యవైశ్యులందరు సామూహిక భోజనాలు ఆరగించి సంతోషాలను పంచుకున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీవాసవి మాత ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగేందుకు సహకరించిన భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తొలి బహుమతి భీమిశెట్టి వాణిప్రభ, ద్వితీయ బహుమతి గజ్జెల విష్ణువర్థన,  తృతీయ బహుమతి ఉషారాణి  దక్కించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

- దేవి శరన్నవరాత్రుల ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఆదివారం వెలుగోడు పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శాస్రోక్తంగా తులాభారాన్ని నిర్వహించారు. కరెన్సీ నాణేలతో చేపట్టిన ఈ తులాభారంలో గుంటూరు రాజ్యలక్ష్మి, శ్రీనివాసులు నాణేలు వేయగా తులాభారం సరితూగింది. తులాభారానికి వినియోగించిన నాణేలను వేలం వేయగా ఎంపీపీ లాలం రమేష్‌ రూ.50వేలకు దక్కించుకున్నారు. ఈయనకు ఆలయ మర్యాదలతో నూతన వస్ర్తాలను, తులాభారం నాణేలను అందజేసినట్లు అమ్మవారిశాల కమిటీ అధ్యక్షుడు లాలం సుధాకర్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-18T04:18:47+05:30 IST