అకారణంగా తిరిగితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-13T05:14:55+05:30 IST

కరోనాపై నిర్లక్ష్యంగా ఉండవద్దని, మాస్క్‌లు ధరించాలని సీఐ తిరుపతి అన్నారు. బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మాస్క్‌లను ధరించకుండా రోడ్ల పైకి వస్తే కరోనా సోకే ప్రమాదం ఉంద న్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

అకారణంగా తిరిగితే కఠిన చర్యలు
నరసన్నపేట: ప్లకార్డులతో అవగాహన ర్యాలీ చేస్తున్న సీఐ తిరుపతి తదితరులు

 టెక్కలి రూరల్‌, మే 12: కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప అకారణంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  సీఐ ఆర్‌.నీలయ్య అన్నారు. బుధవారం ఇందిరాగాంధీ కూడలిలో తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలకు తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదన్నారు. కరోనా నిబంధనలు పాటించ కుండా తిరుగుతున్న పలు వాహనాలకు అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎన్‌.కామేశ్వరరావు, గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు. 


నిర్లక్ష్యం వద్దు

నరసన్నపేట: కరోనాపై నిర్లక్ష్యంగా ఉండవద్దని, మాస్క్‌లు ధరించాలని సీఐ తిరుపతి అన్నారు. బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మాస్క్‌లను ధరించకుండా రోడ్ల పైకి వస్తే కరోనా సోకే ప్రమాదం ఉంద న్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, ప్రసాద్‌, ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 59 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీటీ హేమసుందర్‌ అన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయాలని గ్రామాల్లో ప్రజలు కోరుతున్నారు. 


మండలంలో 25 కరోనా కేసులు

నందిగాం: మండలంలో బుధవారం 25 కేసులు నమోదైనట్లు తహసీ ల్దార్‌ నమ్మి రాజారావు తెలిపారు. గ్రామాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించి సచివాలయాల పరిధిలో నిర్వ హించిన కోవిడ్‌ పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయన్నారు. కాపుతెంబూరు, కొండతెంబూరు తది తర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు. నందిగాం పీహెచ్‌సీ, బీసీ బాలుర వసతి గృహంలో రెండోడోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టారు. నందిగాం, కవిటి అగ్రహారం, పెద్దబాణాపురం తదితర సచివాలయాల పరిధి లో 60 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి కె.అనితకుమారి తెలిపారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను అరికట్టవచ్చన్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.


నిబంధనలు పక్కాగా అమలు

జలుమూరు: మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్లలో కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి కె.రాజగోపాలరావు ఆదేశించారు. అచ్యుతాపురం గ్రామాన్ని బుధవారం పరిశీలించారు. పాజిటివ్‌ కేసులు వారు తప్పనిసరిగా హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారికి ఐసోలేషను కిట్లు అందచేసి వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. వీఆర్వో ఎస్‌.రామారావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం 24 పాటిజివ్‌ కేసులు బయటపడ్డాయని తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ తెలిపారు.  కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోకి రాకపోకలు నిషేధించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలుమూరు, అచ్చుతాపురం, సైరిగాం పీహెచ్‌సీల్లో బుధవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వైద్యాధికారులు తాడేల శ్రీకాంత్‌, హనుమంతు సునీత, గురునాథరావు నేతృత్వంలో చేపట్టారు. మొత్తం 77 మందికి కరోనా పరీక్షలు చేయడంతో పాటు మరో 76 మందికి రెండోడోసు వ్యాక్సిన్‌ వేశారు. 


12 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు

రాజాం: కరోనా విజృంభిస్తున్నందున పట్టణంలో 12 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ ఎన్‌. రమేష్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు బయటకు రావ ద్దని హెచ్చరించామన్నారు. అలాగే బయట వ్యక్తులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లకూడదన్నారు. 14 రోజుల పాటు కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతాయన్నారు. పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత చేపడుతున్న కర్ఫ్యూ పక్కా గా అమలవుతోంది. పోలీసుల హెచ్చరికలతో దుకాణాలను సకాలంలో మూసివేస్తుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇతరులెవరినీ పట్టణంలోకి పోలీసులు అనుమతించడం లేదు. 

 


 


Updated Date - 2021-05-13T05:14:55+05:30 IST