సీసీఈకి తిలోదకాలు

ABN , First Publish Date - 2021-10-20T04:50:07+05:30 IST

ఇటీవలి కాలంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. తాజాగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానానికి ఎస్‌సీఈఆర్‌టీ తిలోదకాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

సీసీఈకి తిలోదకాలు

ఎస్‌సీఈఆర్‌టీ వింత నిర్ణయం 

విస్తుపోతున్న ఉపాధ్యాయ లోకం 


ఒంగోలు విద్య, అక్టోబరు 19 : ఇటీవలి కాలంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. తాజాగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానానికి ఎస్‌సీఈఆర్‌టీ తిలోదకాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీసీఈ మౌలిక విధానానికి తూట్లు పొడుస్తూ ఎఫ్‌ఏ-1 స్లిప్‌ టెస్టు ప్రశ్నాపత్రాలు ఎస్‌సీఈఆర్‌టీ జారీచేస్తామనడం చర్చనీయాంశమైంది. ఎఫ్‌ఏ-1 పరీక్ష అంటే ఇదేదో జాతీయ స్థాయి పరీక్షలా గంట ముందు అధికారులకు వాట్సా్‌పలో ప్రశ్నాపత్రాలు పంపడం, పరీక్ష సమయానికి 15 నిమిషాలు ముందు ప్రశ్నలను బోర్డు మీద రాయమనడం వంటి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీసీఈలో భాగంగా విద్యార్థులకు ఫార్మెటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ), సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈనెల 21 నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ జారీచేసింది. ఎఫ్‌ఏ-1 పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో 20 మార్కులకు స్లిప్‌ టెస్టు, ప్రాజెక్టుకు 10 మార్కులు, విద్యార్థుల రాత పనికి 10మార్కులు, తరగతిలో విద్యార్థుల ప్రతి స్పందనలకు 10 మార్కులు కేటాయించారు. ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులే స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి పరీక్ష నిర్వహించాలి. ప్రస్తుతం ఈ విధానానికి స్వస్తి చెప్పి ఎఫ్‌ఏ-1 ప్రశ్నాపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీనే తయారు చేయించి జిల్లాస్థాయి అధికారులకు గంట ముందుగా వాట్సాప్‌ ద్వారా పంపుతారు. పరీక్షకు కేటాయించిన గంట సమయంలో మొదటి 15 నిమిషాల్లో వాట్సాప్‌ ద్వారా వచ్చిన ప్రశ్నాపత్రాన్ని సంబంఽధిత ఉపాధ్యాయుడు బోర్డుపై రాసి పరీక్ష నిర్వహించాలి. ఈ నిర్ణయం తీవ్ర విమర్శల పాలవుతోంది. 


పరీక్ష షెడ్యూల్‌ ఇది 

1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌సీఈఆర్‌టీ ప్రకటించింది. ప్రాథమిక తరగతులకు 1 నుంచి 5వ తరగతి వరకు 21న తెలుగు, 22న ఇంగ్లీషు, 23న గణితం, 25న పరిసరాల విజ్ఞా నం పరీక్షలు ఉదయం 10 నుంచి 11గంటలకు వరకు నిర్వహించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటలకు, మధ్యా హ్నం 3నుంచి 5గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 21న ఉదయం తెలుగు, మధ్యా హ్నం గణితం 22న, ఉదయం హిందీ, మ ధ్యాహ్నం జనరల్‌/ఫిజికల్‌ సైన్సు, 23న ఉద యం ఇంగ్లీషు, మధ్యాహ్నం సోషల్‌ స్టడీస్‌, 25న ఉదయం ఒరియంటల్‌ లాంగ్వేజేస్‌, మధ్యాహ్నం బయలాజికల్‌ సైన్సు పరీక్ష నిర్వహించాలి.

Updated Date - 2021-10-20T04:50:07+05:30 IST