Abn logo
Aug 11 2020 @ 00:21AM

థియేటర్లలోకి... ఏడాది ఆలస్యంగా!

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను తొలుత ఈ ఏడాది క్రిస్మ్‌సకి విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా చిత్రబృందం ప్రణాళికలకు అడ్డుపడింది. చిత్రీకరణకు అంతరాయం కలిగించింది. అందువల్ల, మిగతా చిత్రాల బాటలో నడుస్తూ... దీని విడుదలనూ వాయిదా వేశారు. ఏకంగా ఏడాది ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మ్‌సకి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆమిర్‌ సహా చిత్రబృందం కీలక సన్నివేశాల చిత్రీకరణకు టర్కీ వెళ్లింది. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, హాలీవుడ్‌ హిట్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌.

Advertisement
Advertisement
Advertisement