రచయిత్రిగా రికార్డుల్లోకి

ABN , First Publish Date - 2020-09-23T05:30:00+05:30 IST

ఎనిమిదేళ్ల వయసులో రచయిత్రి కావాలనుకుంది. పదేళ్ల వయసులో ఏకంగా అతి పిన్నవయస్కురాలైన

రచయిత్రిగా రికార్డుల్లోకి

ఎనిమిదేళ్ల వయసులో రచయిత్రి కావాలనుకుంది. పదేళ్ల వయసులో ఏకంగా అతి పిన్నవయస్కురాలైన కన్నడ రచయిత్రిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఆ చిన్నారి పేరు మాన్య హర్ష. 


 కర్ణాటకు చెందిన మాన్యకు పుస్తకాలు రాయడానికి స్ఫూర్తి ఎవరో తెలుసా! ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి. ‘‘ఆమె రాసిన పుస్తకాలు బాగా చదువుతాను. ఏదో ఒక రోజు ఆమెను కలుస్తాను’’ అంటుంది మాన్య.

 మాన్య ప్రకృతిపై రాసిన 55 పద్యాలతో కూడిన పుస్తకం ‘నేచర్‌ అవర్‌ ఫ్యూచర్‌’ పేరుతో విడుదలయింది. ఆ తరువాత మాన్య ఇండియన్‌ ఆర్మీపై ఒక పద్యం రాసింది.

 ఇటీవల ‘నీరిన పుటని సంరక్షకరు’ పేరుతో రాసిన పుస్తకంతో  అతి పిన్నవయస్కురాలైన కన్నడ రచయిత్రిగా గుర్తింపు పొందింది. ‘ది వాటర్‌ హీరోస్‌’ పేరుతో ఆ పుస్తకం ఇంగ్లీషులోకి అనువాదం అయింది.

 కన్నడతో పాటు హిందీ, ఫ్రెంచ్‌, మరికొన్ని భాషల్లో పుస్తకాలు రాయాలని అనుకుంటోంది మాన్య. ఈ చిన్నారి పుస్తకాలు రాయడమే కాదు పాటలు బాగా పాడుతుంది. డ్యాన్స్‌ కూడా చేస్తుంది.


Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST