ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-17T04:48:13+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాల సేకరణకు సర్వేను ప్రారంభించారు.

ఇంటింటా ఫీవర్‌ సర్వే
ఎలమంచిలి మిలట్రీ కాలనీలో సర్వే చేస్తున్న సిబ్బంది



ఎలమంచిలి/ రాంబిల్లి, మే 16 : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాల సేకరణకు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎలమంచిలి మునిసిపాలిటీలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆదివారం మిలట్రీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇదిలావుంటే,  రాంబిల్లి మండలంలోని రాంబిల్లి, దిమిలి పీహెచ్‌సీల సిబ్బంది , ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు ఆయా గ్రామాల నాయకులు సైతం సహకారం అందిస్తున్నారు.

Updated Date - 2021-05-17T04:48:13+05:30 IST