ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-09T05:32:53+05:30 IST

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రామగిడ్డయ్య తెలిపారు.

ఇంటింటా ఫీవర్‌ సర్వే

కర్నూలు(హాస్పిటల్‌), మే 8: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రామగిడ్డయ్య తెలిపారు. తన కార్యాలయం నుంచి శనివారం వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి థర్మల్‌ స్కీనింగ్‌, పల్స్‌మీటర్‌తో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జ్వరం, జలుబు ఉంటే శాంపిల్స్‌ సేకరించాలని,  కరోనా లక్షణాలతో హోం ఐసొలేషన్‌ ఉన్న వారికి కిట్లు ఇచ్చి, వివరాలు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-05-09T05:32:53+05:30 IST