రేపటి నుంచి ఇంటింటా కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-30T10:32:50+05:30 IST

సీఎం ఆదేశాల మేరకు జూలై 1 నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని డిప్యూటీ సీఎం

రేపటి నుంచి ఇంటింటా కరోనా పరీక్షలు

డిప్యూటీ సీఎం


కడప (ఎర్రముక్కపల్లె), జూన్‌ 29: సీఎం ఆదేశాల మేరకు జూలై 1 నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తెలిపారు. కడప కార్పొరేషన్‌లో సోమవారం కోవిడ్‌-19పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తోందని, అత్యధికంగా పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మాస్కులు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, మున్సిపల్‌ కమిషనరు లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహసీల్దారు శివరామిరెడ్డి పాల్గొన్నారు.


ఆర్జేడీ కార్యాలయానికి శంకుస్థాపన

రూ.2.40 కోట్లతో ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ కార్యాలయ నిర్మాణం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా తెలిపారు. కడప ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో సోమవారం ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీవీఈవో రవి, ఆర్‌ఐవో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T10:32:50+05:30 IST