గ్రామాల్లో ఇంటింటా కొవిడ్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-07T04:39:46+05:30 IST

ఆసిఫాబాద్‌ మండ లంలో గురువారం ఏఎన్‌ఎం, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్‌ల బృందం ఇంటింటి కొవిడ్‌ సర్వేను చేపట్టింది.

గ్రామాల్లో ఇంటింటా కొవిడ్‌ సర్వే
ఆసిఫాబాద్‌లో సర్వేను పరిశీలిస్తున్న అధికారులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 6: ఆసిఫాబాద్‌ మండ లంలో గురువారం ఏఎన్‌ఎం, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్‌ల బృందం ఇంటింటి కొవిడ్‌ సర్వేను చేపట్టింది. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశాల మేరకు సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వరం, కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారి గురించి ఆరా తీశారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి కిట్లు అప్పటికప్పుడే అందజేశారు. అలాగే 45 సంవ త్సరాలు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. సర్వేను ఎంపీడీవో శశికళ, ఇన్‌చార్జి తహసీల్దార్‌ పోచయ్య, వైద్యాధికారి సత్యనారాయణ, ఈవో రాజబాబు పర్యవేక్షించారు. 

వాంకిడి: మండలంలో గురువారం అధికారులు కొవిడ్‌ వైరస్‌పై ఇంటింటి సర్వేను నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు, కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసు కుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. సర్వేను డీపీవో రమేష్‌ పర్యవేక్షించారు.

బెజ్జూరు: మండల కేంద్రంలో గురువారం కొవి డ్‌-19 సర్వేను నిర్వహించారు. ఇంటింటింటికీ తిరిగి ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌, ఆశావర్కర్‌ వైశాలి, కారోబార్‌ వసంత్‌ పాల్గొన్నారు. 

తిర్యాణి: మండలంలోని కోలాంగూడ గ్రామంలో గురువారం అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రజలు భయాన్ని వీడి కరోనా టీకా వేసుకోవాల న్నారు. వీఆర్వో హీలాయ్స్‌, ఉప సర్పంచ్‌ బొజ్జిరావు, అంగన్‌వాడీ కార్యకర్తవిజయ, ఆశావర్కర్‌ తాను బాయి పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని బీబ్రా, దహెగాం, కోత్మీర్‌, ఇట్యాల, లగ్గాం, ఐనం, హత్తిని, పెసరికుంట తదితర గ్రామాల్లో గురువారం పంచాయతీ కార్య దర్శి, వీఆర్‌ఏ,అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు ఇంటింట తిరుగుతూ కొవిడ్‌-19 జ్వరంవస్తున్న వారి వివరా లను సేకరించారు. ఈ సీజన్‌లో కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు ఇంట్లో ఉండి చికిత్స పొందా లన్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలన్నారు.

సిర్పూర్‌(యూ): మండలంలోని ఖాతిగూడ, పాములవాడ గ్రామాల్లో గురువారం అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, టీకాలు వేయించుకోవాలన్నారు. ఎంపీడీవో మధుసుదన్‌, డీటీ సంతోష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ నీలకంఠం పాల్గొన్నారు.

లింగాపూర్‌: మండలంలోని పిక్లానాయక్‌తండ, మామిడిపల్లి, కొత్తపల్లి, లింగాపూర్‌, జాముల్‌ధర, లోద్దిగూడ, చిన్నదంపూర్‌, చోర్‌పల్లి, ఏల్లాపటార్‌, కంచనపల్లి, కిమానా యక్‌ తండ, ఝాం నూర్‌, మోతిపటార్‌, పిట్టాగుడ, గ్రామాల్లో అధికారులు జ్వరా లపై సర్వే నిర్వహిం చారు.

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి..

- జడ్పీ సీఈవో రత్నమాల

కెరమెరి: కొవిడ్‌ సర్వేను గ్రామాల్లో ఇంటింట తిరుగుతూ పక్బందీగా చేపట్టాలని జడ్పీ సీఈవో రత్నమాల అన్నారు. గురువారం మండలంలోని కేస్లాగూడ, కెరమెరి, మోడి, ఝరి గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేప థ్యంలో సర్వేకు సహకరించి వారి వారి కుటుంబాల్లో ఎవరైనా లక్షణాలతో బాధపడుతున్న వారుంటే వివ రాలు తెలపాలన్నారు. కొవిడ్‌ సోకినట్లయితే ఇంటి వద్దనే మెడికల్‌ కిట్లు అందజేస్తారన్నారు. కార్యక్ర మంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌నా యక్‌, తహసీల్దార్‌ సమీర్‌అహ్మద్‌, ఎంపీడీవో దత్తా రాం, వైద్యాధికారి సుంకన్న, జడ్పీటీసీ ద్రుపదాబాయి ఉన్నారు.

సిర్పూర్‌(టి): ఇంటింటి సర్వేను టీం లీడర్లు పకడ్బందీగా నిర్వహించాలని ప్రత్యేకాధికారి పీఆర్‌ ఈఈ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం మండ లపరిషత్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నదీముల్లా ఖాన్‌తో కలిసి మండలంలోని 16 గ్రామాల్లో సర్వే బృందాలతో ప్రత్యేకసమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో వారందరి వివరాలు సేకరించి ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే వారిపేర్లను నమోదు చేసుకోవా లన్నారు. సర్వేను మూడు రోజుల్లో పూర్తిచేయాల న్నారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో కృష్ణమూర్తి, కో ఆప్షన్‌సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌, వార్డుసభ్యులు ఇఫ్ప తుస్సేన్‌, శంకర్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కౌటాల: గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటి కొవిడ్‌ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తహీసల్దార్‌ మునావర్‌ షరీఫ్‌ అన్నారు. గురువారం ఆయన అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లోగా అన్నిగ్రామాల్లో సర్వేపూర్తయ్యేలా చూడా లని, ప్రతి ఇంటికి వెళ్లివివరాలు సేకరించాలని సూచించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లయితే వారి వివరాలు సేకరించి,కిట్‌ అందించాలన్నారు. సమావే శంలో ఎంపీడీవో కుటుంబరావు, ఎంపీవో శ్రీధర్‌రాజ్‌, ఆర్‌ఐదేవేందర్‌, అన్నిశాఖలఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T04:39:46+05:30 IST