ఎల్లలు దాటిన పేగుబంధం!

ABN , First Publish Date - 2022-05-19T08:21:00+05:30 IST

పాకిస్థాన్‌ ముస్లిం ఇంట పెరిగిన ఓ భారతీయ సిక్కు మహిళ కథ ఇది. ఆమె పేరు ముంతాజ్‌ బీబీ.

ఎల్లలు దాటిన పేగుబంధం!

పాక్‌ ముస్లిం ఇంట పెరిగిన సిక్కు మహిళ

75 ఏళ్ల తర్వాత సొంత గూటికి

కర్తార్‌పూర్‌, మే 18: పాకిస్థాన్‌ ముస్లిం ఇంట పెరిగిన ఓ భారతీయ సిక్కు మహిళ కథ ఇది. ఆమె పేరు ముంతాజ్‌ బీబీ. 1947లో జరిగిన దేశ విభజన సమయంలో జన్మించిన ఆమె.. ఊహ తెలియక ముందే నాడు జరిగిన మత ఘర్షణల్లో తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ సమయంలో తల్లి మృతదేహం ముందు ఏడుస్తున్న ఆ శిశువును.. ఓ ముస్లిం మహిళ.. ’ఈ శిశువు నా బిడ్డే’ అని చెప్పిన ఓ చిన్న అబద్ధం.. ఆమెను కాపాడింది. అనంతరం ఆ కుటుంబం.. తమతో పాటే ఆ శిశువును కూడా పాకిస్థాన్‌ తీసుకెళ్లింది. ముంతాజ్‌ బీబీ అని పేరు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల పేర్లు మహ్మద్‌ ఇక్బాల్‌, అల్లారఖీ. ఇప్పటి వరకు నిజం చెప్పని ఆమె తండ్రి ఇక్బాల్‌.. తన చివరి దశలో గతం చెప్పడంతో తన సొంత కుటుంబాన్ని ఓ సారి చూడాలని ముంతాజ్‌ పరితపించారు. సోషల్‌మీడియా ద్వారా ప్రయత్నించింది.   తనకు ఇద్దరు సోదరులు ఉన్నారని తెలుసుకుని.. సంప్రదించారు. గురుద్వార్‌ నుంచి వీసా లేకుండానే కర్తార్‌పూర్‌ రావొచ్చని తెలుసుకున్నారు.బుధవారం భారత్‌ వచ్చి తన సోదరులను కలుసుకున్నారు.  

Updated Date - 2022-05-19T08:21:00+05:30 IST