సజావుగా సాగిన నృత్య, సంగీత కోర్సుల నిపుణుల ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-05-24T05:26:34+05:30 IST

వైవీయూనివర్శిటీ పరిధిలో లలితకలల విభాగంలో కడప సీపీబ్రౌన్‌ గ్రంథాలయంలో నృత్య, సంగీత కోర్సుల విషయనిపుణుల ఇంటర్వ్యూలు సజావుగా జరిగాయి.

సజావుగా సాగిన నృత్య, సంగీత కోర్సుల నిపుణుల ఇంటర్వ్యూలు
కళాకారులను సన్మానిస్తున్న వీసీ సూర్యకళావతి

కడప వైవీయూ, మే 23: వైవీయూనివర్శిటీ పరిధిలో లలితకలల విభాగంలో కడప సీపీబ్రౌన్‌ గ్రంథాలయంలో నృత్య, సంగీత కోర్సుల విషయనిపుణుల ఇంటర్వ్యూలు సజావుగా జరిగాయి. ఇంటర్వ్యూలలో కూచిపూడి, కర్ణాటక సంగీతం, జానపద సంగీతం, లలితసంగీతం, కీబోర్డు, హార్మోనియం, డప్పు, తబళ, కోర్సులకు సంబందించిన నిపుణులను ఎంపిక చేసినట్లు వీసీ సూర్యకళావతి తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రత్యేక నిపుణులుగా ఆచార్య ద్వారం లక్ష్మి, డాక్టర్‌ నిర్మల, సంగీత, నృత్య రంగాలలో చేస్తున్న సేవలకు వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డిలు సన్మానించారు. ఇంటర్వ్యూలలో సంబందిత విషయనిపుణులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌రెడ్డి, లలితకలల విభాగం అధిపతి డాక్టర్‌ మూలె మల్లికార్జునరెడ్డి, డాక్టర్‌ కోట మృత్యుంజయరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:26:34+05:30 IST