నేడు అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-09-25T06:35:38+05:30 IST

స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం అంగ్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు

నేడు అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

గూడూరు(రూరల్‌), సెప్టెంబరు 24: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం  అంగ్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రూరల్‌ సీడీపీవో ఈశ్వరమ్మ తెలిపారు.  ఉదయం 9 గంటల నుంచి వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, గూడూరు, చిల్లకూరు ప్రాజెక్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోస్టాట్‌ కాపీలను తీసుకురావాలన్నారు. మాస్కులు ధరించి కోవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. 

Updated Date - 2020-09-25T06:35:38+05:30 IST