Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 30 Mar 2022 02:22:08 IST

ఇంటర్వ్యూల్లోనూ రివర్స్‌!

twitter-iconwatsapp-iconfb-icon

అవకతవకలకు ఆస్కారమంటూ తీసేశారు

మళ్లీ పెడతారట... మడమ తిప్పిన సర్కారు

ఇంటర్వ్యూలపై అధ్యయనానికి ఆదేశాలు


అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘ఇంటర్వ్యూలలో గోల్‌మాల్‌ జరుగుతోంది. అభ్యర్థులందరినీ ఒకే సమతూకం ఉన్న ప్రశ్నలు అడగడం లేదు. అందుకే గ్రూప్‌-1తో సహా ఏపీపీఎస్సీ ద్వారా నియామకం అయ్యే ఏ పోస్టుకూ ఇక ఇంటర్వ్యూలు ఉండవు’... గత ఏడాది  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. ఆ నిర్ణయం తీసుకోవడమే కాకుండా గతేడాది జూన్‌ 26వ తేదీన ఉత్తర్వులు (జీవోనం.58) కూడా జారీచేసింది. కానీ ఇప్పుడు దానిపై జగన్‌ ప్రభుత్వం మళ్లీ మడమ తిప్పింది. ఇంటర్వ్యూలు పెట్టాల్సిందే అనే దిశగా ఆలోచిస్తోంది.


దీనిపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఈ నెల 22వ తేదీన ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇంటర్వ్యూలు పెట్టాలంటూ ఆ లేఖలో కోరారు. దీనిపై జీఏడీ కూడా స్పందిస్తూ ఒక అధ్యయనం చేయాలంటూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి నాలుగు రోజుల తర్వాత, ఈ నెల 26వ తేదీన లేఖ రాసింది.  నిర్ణయం తీసుకునేటప్పుడే సమగ్రంగా అధ్యయనం చేసి చేయాల్సిన పనిని...అప్పటికేది తోస్తే అది చేసేయడం...మళ్లీ బుద్ధి పుడితే మార్చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని ఆలోచించాలి. కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు తర్కించి చేయాలి. అయితే ఈ ప్రభుత్వానికి మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. లేచిందే లేడికి పరుగు అన్నట్లు ఏదైనా ఆలోచన వస్తే తీసేసుకోవడం...మళ్లీ వెనక్కుమళ్లడం అలవాటైపోయినట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. 


ఎందుకీ రివర్స్‌!

ఏపీపీఎస్సీలోని కొంతమంది సభ్యులు ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు సమాచారం. ఇక ఇంటర్వ్యూలే లేకుంటే తామెందుకు స భ్యులుగా ఉన్నట్లంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. దీంతో  ఇంటర్వ్యూలు పెట్టాల్సిన అవసరం ఉందంటూ ఏపీపీఎస్సీ కార్యదర్శి... జీఏడీకి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఏపీపీఎస్సీ సభ్యుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అనే అంశాన్ని పేర్కొనడం గమనార్హం. అయితే విజ్ఞప్తి అని పేర్కొన్నా.. ఒత్తిడి రావడంతోనే ఇంటర్వ్యూలు పెట్టేదిశగా ప్రభుత్వానికి లేఖ రాశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లేఖలో ఐదు అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రజల నుంచి ఇంటర్వ్యూలు మళ్లీ పెట్టాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. ఏపీపీఎస్సీ సభ్యుల నుంచి విజ్ఞప్తి వచ్చింది. అలాగే.. ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల విశాల దృక్పథం, ఉద్యోగం పట్ల అతనికున్న తపన, ఒక నిర్దిష్ట సమయంలో అతడు ఎలా స్పందిస్తాడనేదాన్ని అంచనా వేయడానికి, అభ్యర్థుల స్వభావాన్ని తెలుసుకోవడం, ఉద్యోగంలో వివిధరకాల వ్యక్తులతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు సరైన దృక్పథంతో వ్యవహరిస్తారా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలు ఉండాలనేది ఏపీపీఎస్సీ ప్రస్తావించిన అంశాలు. ఈ లేఖపై జీఏడీ అదనపు కార్యదర్శి స్పందిస్తూ.. ‘‘ఇంటర్వ్యూలు ఉండడం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. ఇంటర్వ్యూల్లో ఒకే ప్రామాణికత కలిగిన ప్రశ్నలను అడగరు. దీంతో మార్కుల విషయంలో వ్యత్యాసాలు వస్తాయి. అంటే అభ్యర్థుల ఎంపికలో న్యాయం ఉండదనే అభిప్రాయం ఉంది’’ అని తెలిపారు. ఈ రెండు పరస్పర విరుద్ద అంశాల దృష్ట్యా ఇంటర్వ్యూల విషయంలో రెండు అంశాలపై అధ్యయనం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నా రు. ఈ అధ్యయనంలో భాగంగా ఇంటర్య్యూలు లేకుండా ఎంపికై ఉద్యోగా లు చేస్తున్న అభ్యర్థులు.. అదేవిధంగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల మధ్య పనితీరులో ఏమైనా తేడాలున్నాయా? అన్న అంశాన్ని అనుభవపూర్వకంగా పరిశీలించాలని కోరారు. ఇంటర్వ్యూలలో అభ్యర్థులందరికీ ఒకే ప్రామాణికత కలిగిన ప్రశ్నలు అడగడం, అం దరిపట్ల తటస్థతతోనే ఇంటర్య్వూలు చేయడానికి ఉన్న అవకాశాలను చూ డాలి. ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి.. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు ఎదురుపడ కుండా ఉండే పద్ధతులు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైకోమెట్రిక్‌ పరీక్షలతో ఇంటర్వ్యూ చేయడాన్ని పరిశీలించాలని సూచించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.